NTPC: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో రిక్రూట్‌మెంట్! 3 d ago

దిల్లీలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జీఈఎల్) మూడేళ్ల కాలపరిమితికి కాంట్రాక్ట్ ప్రాతిపదిన 182 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం ఉద్యోగాల్లో ఇంజినీర్ (సివిల్)-40, ఎలక్ట్రికల్-80, మెకానికల్-15, కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్-10, ఐటీ-4, ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్స్)-7, ఫైనాన్స్-26 ఉన్నాయి. విద్యార్హత సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచిలో బీఈ/బీటెక్ తో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. గరిష్టంగా అభ్యర్ధుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఇక్కడ క్లిక్ చేయండి.